![]() |
![]() |
.webp)
సోనియా ఆకుల బుల్లితెర మీద ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న పేరు. సోనియా కూడా అన్ని రకాల షోస్ లో కనిపిస్తోంది. ఇష్మార్ట్ జోడి 3 లో భర్త యష్ తో వచ్చి టాస్కులు ఆడుతోంది. మిగతా జోడీస్ కి కూడా టఫ్ ఫైట్ ఇస్తోంది. అలాంటి సోనియా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "మీరు నా గురించి ఎం తెలుసుకోవాలనుకుంటున్నారు" అంటూ నెటిజన్స్ ని అడిగింది. దానికి ఒక నెటిజన్ "బిగ్ బాస్ సీజన్ 9 కి అవకాశం వస్తే వెళ్ళండి అక్కా మిమ్మల్ని ఫస్ట్ లేడీ విన్నర్ గా చూడాలని ఉంది" అని అడిగారు "బిగ్ బాస్ అనుకుంటేనే తప్ప విన్నింగ్ అన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదుమా" అని సోనియా ఆన్సర్ ఇచ్చింది. అలాగే ఫాక్ట్స్ ఆఫ్ ది షో అనే హాష్ టాగ్ కూడా పెట్టింది. ఐతే సోనియా యూపిఎస్సి యాస్పిరెంట్ కూడా..ఐతే ఒక నెటిజన్ ఐతే "హాయ్ అక్క మీరు ఎన్నిసార్లు యూపిఎస్సి అటెంప్ట్స్ ఇచ్చారు. మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు. సజెషన్స్ చెప్పండి " అని అడిగేసరికి "రెండు అటెంప్ట్స్ ఇచ్చా ఐతే మైన్స్ కి వెళ్ళలేపోయా. ఫైనాన్సియల్ గా వీక్ కాబట్టి నేను సంపాదించుకోవాలి, చదువుకోవాలి .. దాంతో అటెంప్ట్ చేయలేకపోయా" అని చెప్పింది.
.webp)
"విరాట్ వాళ్ళ అమ్మ గారి గురించి మీరు బాగా చెప్పారు" అని ఒక నెటిజన్ అనేసరికి "నిజంగా వాళ్ళ అమ్మ గారంటే చాల గౌరవం నాకు." అని చెప్పింది. బిగ్ బాస్ తెలుగు 8 షోతో పాపులర్ అయిన సోనియా ఆకుల ఇటీవల వ్యాపారవేత్త యష్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. వీళ్ళ పెళ్ళికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సోనియా ముందుంటుంది. ఆసా అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఎంతో మంది అనాథ పిల్లలకు అదుకుంటుంది. ప్రాజెక్ట్ ప్రేరణ పేరుతో ఆడపిల్లలకు అండగా ఉంటోంది సోనియా.
![]() |
![]() |